తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు..
ABN, Publish Date - Apr 11 , 2026 | 11:28 AM
తెలంగాణలో వేసవి తీవ్రత మొదలైంది. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపటి నుంచి ఎండ తీవ్రత మరింత పెరగనున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో..
తెలంగాణలో వేసవి తీవ్రత మొదలైంది. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపటి నుంచి ఎండ తీవ్రత మరింత పెరగనున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో 44 డిగ్రీల వరకూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌లోనూ 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని, ఈ నెల 22 వరకూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.
పూర్తి వీడియోను ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Apr 11 , 2026 | 11:29 AM