బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీకి తుపాను హెచ్చరిక
ABN, Publish Date - Nov 15 , 2026 | 08:52 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది త్వరలోనే తీవ్ర తుపానుగా మారి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర తీరాల వైపు దూసుకొచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది త్వరలోనే తీవ్ర తుపానుగా మారి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర తీరాల వైపు దూసుకొచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 18 నుంచి 21 వరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Nov 15 , 2026 | 08:55 PM