జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాస..
ABN, Publish Date - Jan 30 , 2026 | 02:02 PM
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కౌన్సిల్ సమావేశం శుక్రవారం రసాభాసగా మారింది. వైసీపీ, కూటమి నేత మధ్య తోపులాట చోటు చేసుకుంది..
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కౌన్సిల్ సమావేశం శుక్రవారం రసాభాసగా మారింది. వైసీపీ, కూటమి నేత మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఒకానొక సమయంలో ఈ సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. అలాంటి పరిస్థితుల్లో ఈ కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టిన అంశాలకు ఎటువంటి చర్చ లేకుండా ఆమోదం తెలిపింది. దీనిపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్ల బ్యాడ్జీలు, ప్లకార్డులతో నిరసన తెలిపారు.
Updated at - Jan 30 , 2026 | 04:10 PM