సీఎం చంద్రబాబును కలిసిన గద్దర్ కూతురు వెన్నెల
ABN, Publish Date - Feb 04 , 2026 | 08:59 PM
ప్రముఖ ప్రజా గాయకుడు, విప్లవ కవి గద్దర్ కూతురు వెన్నెల ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్బంగా ఆమె ఒక వినతిపత్రం అందజేశారు. తెలుగు సాంస్కృతిక రంగానికి, ప్రజా ఉద్యమాలకు గద్దర్ చేసిన విశేష సేవలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విప్లవ గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గద్దర్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని, ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ కల్చరల్ విభాగానికి గద్దర్ పేరు పెట్టాలన్న యూనివర్సిటీ ప్రొఫెసర్ల కోరిక మేరకు సీఎంకు వినతిపత్రం అందజేశారు. తమ విజ్ఞప్తులపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని వెన్నెల తెలిపారు.
ఈ వీడియోలు కూడా చూడండి:
పార్లమెంట్ మెట్లు దిగుతూ జారిపడిన శశిథరూర్
పోలీసోళ్లు లేకుండా రా..: హరీష్ రావు సవాల్
Updated at - Feb 04 , 2026 | 09:53 PM