ఈడీ విచారణలో కీలక విషయాలు చెప్పిన ఎర్ర గంగిరెడ్డి
ABN, Publish Date - Sep 29 , 2026 | 12:29 PM
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డిని ఈడీ అధికారులు రెండో రోజు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డిని ఈడీ అధికారులు రెండో రోజు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. వివేకా హత్యకు సంబంధించి జరిగినట్లుగా భావిస్తున్న రూ.40 కోట్ల సుపారీ ఒప్పందం, నిందితుల ఖాతాల ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలు, హవాలా మార్గాలపై ఈడీ దృష్టి సారించింది. దస్తగిరి, సునీల్ యాదవ్ ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఎర్ర గంగిరెడ్డి బ్యాంక్ లావాదేవీలను అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Sep 29 , 2026 | 12:33 PM