తప్పు చేయకపోతే భయమెందుకు..!?

ABN, Publish Date - Jan 14 , 2026 | 05:34 PM

ప్రముఖ టీవీ ఛానెల్ రిపోర్టర్లు అరెస్ట్‌పై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.

హైదరాబాద్: ఒక టీవీ ఛానెల్ రిపోర్టర్ల అరెస్ట్‌పై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. విచారణకు సహకరించాలంటూ రిపోర్టర్లుకు ఆయన సూచించారు. తప్పు చేయకపోతే భయమెందుకంటూ ప్రశ్నించారు. ఎందుకు పారిపోతున్నారు? అని వారిని నిలదీశారు. వారు.. పారిపోయేందుకు ప్రయత్నిస్తేనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వీసీ సజ్జనార్‌ వివరించారు. ఈ కేసు విచారణకు హాజరువుతామని చెప్పి.. ఫోన్ స్విచ్‌ ఆఫ్‌ చేశారని వీసీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. 'ఛానల్‌ సీఈఓ ఎక్కడున్నారు?.. విచారణకు రావాలి కదా?' అంటూ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ మండిపడ్డారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

పిడకలతో 4 కిలోమీటర్ల పొడుగు భోగి దండ

కామారెడ్డి లో 600 కుక్కలు మృతి!! ఐదుగురు సర్పంచ్‌లపై కేసులు

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jan 14 , 2026 | 05:46 PM