ఎమ్మెల్యే సంజయ్‌పై జీవన్ రెడ్డి ఫైర్
ABN, Publish Date - Jan 22 , 2026 | 07:49 AM
హైదరాబాద్ గాంధీభవన్‌లో నిజామాబాద్ మున్సిపల్ సన్నాహాక సమావేశంలో గందరగోళం ఏర్పడింది. ఈ సమావేశానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి అలిగారు.
హైదరాబాద్ గాంధీభవన్‌లో నిజామాబాద్ మున్సిపల్ సన్నాహాక సమావేశంలో గందరగోళం ఏర్పడింది. ఈ సమావేశానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ హాజరయ్యారు. దాంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి అలిగారు. ఆ వెంటనే గాంధీ భవన్ నుంచి ఆయన వెళ్లిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థిగా సంజయ్ బరిలో నిలిచి.. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై గెలిచారు. అనంతరం సంజయ్.. కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పార్టీలోకి సంజయ్ రాకను జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఉప్పు నిప్పు అన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సన్నాహాక సమావేశానికి సంజయ్ రావడంతో.. అక్కడి నుంచి జీవన్ రెడ్డి వెళ్లిపోయారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
గుంపు మేస్త్రి, గుంటనక్క కలిసి ట్యాపింగ్ డ్రామాలు
ప్రియుడు మోసం చేశాడంటూ పీఎస్ ముందు యువతి ఆందోళన
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jan 22 , 2026 | 08:18 AM