Share News

మీరాలం చెరువు అభివృద్ధికి సీఎం ఆదేశాలు

ABN , Publish Date - Aug 27 , 2026 | 11:12 AM

మీరాలం చెరువుపై నిర్మిస్తున్న సస్పెన్షన్‌ బ్రిడ్జి పనులను సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. మీరాలంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు

మీరాలం చెరువు అభివృద్ధికి సీఎం ఆదేశాలు

హైదరాబాద్‌: మీరాలం చెరువుపై నిర్మిస్తున్న సస్పెన్షన్‌ బ్రిడ్జి పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతిని అధికారులు ఫొటో ప్రదర్శన ద్వారా సీఎంకు వివరించారు. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. చెరువులోకి మురుగు నీరు చేరకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవడం సహా చెరువు నుంచి మూసీలోకి వరద నీరు సాఫీగా వెళ్లేలా నాలాను విస్తరించాలని సూచించారు. మీరాలంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.


ఇవీ చదవండి:

చిలకలూరిపేట ప్రమాదంపై సీఎం చంద్రబాబు, మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి..

అనంతపురం హైవేపై అదుపుతప్పిన ఇన్నోవా.. ఇద్దరి మృతి

Updated Date - Aug 27 , 2026 | 11:12 AM