తెలంగాణకు మెస్సీని కాకుండా డ్రగ్ డీలర్లను తీసుకురావాలా.?

ABN, Publish Date - Mar 28 , 2026 | 09:46 PM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రజాప్రతినిధుల స్పోర్ట్స్, కల్చరల్ మీట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు మంచి క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రజాప్రతినిధుల స్పోర్ట్స్, కల్చరల్ మీట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు మంచి క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు. తమ కేబినెట్‌లోనూ మంచి క్రీడాకారులు ఉన్నారన్నారు. ప్రజా జీవితంలో ఉన్నవారికి క్రీడలు ఓ ఉపశమనం అని సీఎం చెప్పుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలని.. సీఎం కప్‌ స్పోర్ట్స్‌ నిర్వహించామన్నారు. లియోనెల్ మెస్సీని హైదరాబాద్‌కు తీసుకొస్తే వివాదం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్సీ ప్రపంచ స్థాయి ఫుట్‌బాల్‌ దిగ్గజమని, మెస్సీలాంటి ఆటగాడిని కాకుండా ప్రపంచ డ్రగ్‌ డీలర్‌ను పిలవాలా? అంటూ ఫైర్ అయ్యారు.


ఇవి చదవండి

ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడమే 'ఉడాన్' ఉద్దేశం: కేంద్ర మంత్రి

అన్నాడీఎంకే స్థానాన్ని ఆక్రమించుకోనున్న విజయ్ టీవీకే

Updated at - Mar 28 , 2026 | 09:49 PM