అన్నాడీఎంకే స్థానాన్ని ఆక్రమించుకోనున్న విజయ్ టీవీకే
ABN , Publish Date - Mar 28 , 2026 | 08:59 PM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే స్థానాన్ని తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న నటుడు విజయ్ తమిళగ వెట్రి కళగం భర్తీ చేయనుందని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ జోస్యం చెప్పారు.
న్యూఢిల్లీ: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే (AIADMK) స్థానాన్ని తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న నటుడు విజయ్ తమిళగ వెట్రి కళగం (TVK) భర్తీ చేయనుందని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ (Manickam Tagore) జోస్యం చెప్పారు. అన్నాడీఎంకే మూలమంత్రం లెజెండ్రీ తమిళ నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ అని, దివంగత ఎమ్జీఆర్ ఎప్పుడూ డీఎంకే కుటుంబానికి వ్యతిరేకంగానే మాట్లాడేవారని, ఇప్పుడు టీవీకే కూడా అదే ఐడియాలజీతో ముందుకు వెళ్తోందని శనివారంనాడిక్కడ ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.
'అన్నాడీఎంకే స్థానాన్ని టీవీకే చేజిక్కించుకుంటుంది. అన్నాడీఎంకేలో పాపులర్ స్టార్ ఎమ్జీఆర్. డీఎంకేను వ్యతిరేకించడమే ఆయన మూలమంత్రం. ఇప్పుడు విజయ్ చేస్తున్నది కూడా. దాంతో అన్నాడీఎంకే, టీవీకే వైఖరి ఒకేలా ఉంది. టీవీకే కూడా అదే భాషలో మాట్లాడుతోంది. విజయ్ తన పాపురాలిరీతో అన్నాఎంకే బలాన్ని తమవైపు తిప్పుకుంటున్నారు' అని మాణిక్యం ఠాగూర్ విశ్లేషించారు.
ఎడప్పాడి పాపులర్ నేత కాదు
అన్నాడీఎంకేలో పాపులర్ నేత ఎవరూ లేరని మాణిక్యం ఠాగూర్ అన్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి మంచి నిర్వాహకుడు (ఆర్గనైజర్) అని, కానీ పాపులారిటీ లేదని, అందువల్ల ప్రజలతో మమేకం కాలేరని అన్నారు. ఆయన తన పార్టీ నిర్మాణంతో, సామాజిక వర్గంతోనే మమేకం కాగరలని, పాన్- తమిళనాడు నేత కాలేరని విశ్లేషించారు. అన్నాడీఎంకే విశ్వసనీయత కోల్పోయిందన్నారు. 2024 ఎలక్షన్‌లో బీజేపీతో వెళ్లడం లేదని చెబుతూ ఒంటరిగా అన్నాడీఎంకే పోటీ చేసిందని, తిరిగి ఏడాదిలోనే యూటర్న్ తీసుకుని బీజేపీతో తిరిగి జతకట్టిందని అన్నారు. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 23న జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
మీరు రావద్దు, ప్రధాని పదవి పోతుందన్నారు.. నొయిడా సెంటిమెంట్‌పై మోదీ
డీఎంకే జాబితా విడుదల.. కొలతూర్ నుంచి సీఎం స్టాలిన్ పోటీ