2026 డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్
ABN, Publish Date - Jan 12 , 2026 | 04:38 PM
త్వరలో రాష్ట్రంలోని ప్రతీ ఉద్యోగికి రూ. కోటి రెండు లక్షల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్, జనవరి 12: తమ ప్రభుత్వానికి వారధులు, సారథులు ప్రభుత్వ ఉద్యోగులేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ఎన్జీవో డైరీ, క్యాలెండర్‌లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఆనాడు ప్రభుత్వం.. వారి తప్పుడు పనులను ఉద్యోగులపై ఒత్తిడి చేసి అమలు చేయించిందని విమర్శించారు. పెద్ద దిక్కుగా ఉండాల్సిన వ్యక్తి వెళ్లి.. ఫామ్ హౌస్‌లో పాడుకున్నారన్నారు. తాను మీకు అన్నగా వచ్చానని చెప్పారు.
ప్రస్తుతం తాను రోజుకు 18 గంటలు పని చేస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు డీఏ ఫైల్‌పై సంతకం చేసి వచ్చానని ఆయన ప్రభుత్వ ఉద్యోగులకు ఆయన వివరించారు. దీంతో ప్రభుత్వానికి రూ. 227 కోట్ల భారం పడనుందన్నారు. త్వరలో రాష్ట్రంలోని ప్రతీ ఉద్యోగికి రూ. కోటి రెండు లక్షల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.
ఉద్యోగులు, ప్రభుత్వం వేర్వేరు కాదన్నారు. ఇద్దరం కలిస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. ల్యాండ్, శాండ్, జీఎస్టీ సబ్సిడీల్లో అవకతవకలు జరుగుతున్నాయని వివరించారు. వాటిని నిరోధిస్తే ప్రభుత్వానికి ఆదాయం మరికొంత మెరుగవుతుందని సీఎం రేవంత్ వివరించారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
నల్లమల సాగర్ పై సుప్రీంకోర్టులో కీలక పరిణామం
NTV, డిజిటల్ మీడియా చానల్స్ మీద కేసు నమోదు
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jan 12 , 2026 | 04:52 PM