ఉప్పల్‌లో పోలీస్ మెడకు చైనా మాంజా చుట్టుకొని తీవ్ర గాయం

ABN, Publish Date - Jan 13 , 2026 | 01:54 PM

సంక్రాంతి సందర్భంగా గాలి పటాలు ఎగురవేయడానికి ఉపయోగిస్తున్న చైనా మాంజా ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. హైదరాబాద్ ఉప్పల్‌లో నల్లగుంట పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా పనిచేస్తున్న నాగరాజు మెడకు చైనా మాంజా చుట్టుకోవడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలించారు. చైనా మాంజా వల్ల రోజూ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి.

సంక్రాంతి సందర్భంగా గాలి పటాలు ఎగురవేయటానికి వాడుతున్న చైనా మాంజా కారణంగా మనుషుల ప్రాణాలు పోతున్నాయి. నిత్యం ఎక్కడో ఓ చోట చైనా మాంజా కారణంగా జనం తీవ్ర గాయాల పాలవుతున్నారు. మరీ ముఖ్యంగా వాహనాలపై వెళుతున్న వారి పాలిట చైనా మాంజాలు యమపాశాలుగా మారుతున్నాయి. తాజాగా, హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌లో ఓ పోలీస్ మెడకు చైనా మాంజా చుట్టుకుంది. చైనా మాంజా కారణంగా నల్లగుంట పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా పని చేస్తున్న నాగరాజు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అతడ్ని ఆస్పత్రికి తరలించారు.


ఇవి చదవండి

జనగామ జిల్లాను రద్దు చేస్తే ఊరుకోం..

గాలిపటాలు ఎగురవేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

Updated at - Jan 13 , 2026 | 01:54 PM