Share News

Kite Flying Safety Tips: గాలిపటాలు ఎగురవేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ABN , Publish Date - Jan 13 , 2026 | 01:38 PM

సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు ఎగురవేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అయితే, చైనీస్ మాంజా వాడకం ప్రాణాంతకంగా మారుతోంది. కాబట్టి, గాలిపటాలు ఎగురవేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం..

Kite Flying Safety Tips: గాలిపటాలు ఎగురవేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Kite Flying Safety Tips

ఇంటర్నెట్ డెస్క్: సంక్రాంతి పండుగ అంటేనే గాలిపటాల సందడి. పిల్లల నుంచి పెద్దల వరకూ.. అంతా రంగురంగుల గాలిపటాలు ఎగురవేస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో చైనీస్ మాంజా (నైలాన్ తీగ) వాడకం పెరిగిపోవడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. చైనీస్ మాంజా చాలా గట్టిగా, పదునుగా ఉంటుంది. దీనికి తోడు ఇది కంటికి కనిపించకపోవడంతో చాలా మంది ప్రమాదాల బారినపడుతున్నారు. దీనివల్ల ఇప్పటికే ఎందరో ప్రాణాలు కోల్పోయాలు. రోడ్లపై వెళ్తున్న బైక్ రైడర్లు ప్రమాదాలకు గురవడం, పక్షులు, పిల్లలకు గాయాలు కావడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. అందుకే చాలా రాష్ట్రాల్లో దీనిపై నిషేధం విధించారు. కాబట్టి, గాలిపటాలు ఎగురవేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.


తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  • చైనీస్ మాంజాను ఉపయోగించవద్దు: ఎప్పుడూ కాటన్ (పత్తి) లేదా పర్యావరణానికి హాని చేయని దారాన్నే వాడాలి. ఇది సురక్షితంగా ఉంటుంది.

  • రోడ్లకు దూరంగా గాలిపటం ఎగురవేయండి: రోడ్లపై, ట్రాఫిక్ ఉన్న ప్రదేశాల్లో గాలిపటాలు ఎగరవేయకండి. ఎప్పుడూ ఓపెన్ గ్రౌండ్, టెర్రస్ లేదా పార్క్‌ వంటి సురక్షిత ప్రదేశాలను ఎంచుకోండి.

  • చిన్నపిల్లలను ఒంటరిగా వదలకండి: పిల్లలు గాలిపటం ఎగురవేస్తుంటే తప్పకుండా పెద్దవారి పర్యవేక్షణ ఉండాలి. తీగ పిల్లల చేతులకు చుట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.

  • చేతులకు గ్లవ్స్ వేసుకోండి: తీగ వల్ల చేతులు కోసుకుపోకుండా ఉండేందుకు గ్లవ్స్ లేదా మందపాటి గుడ్డ చేతులకు చుట్టుకోవడం మంచిది.

  • విద్యుత్ తీగల దగ్గర ఎగురవేయకండి: కరెంట్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర గాలిపటం ఎగురవేయడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్, షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది.

  • వాహనదారుల పట్ల జాగ్రత్త: రోడ్లపై దారాలు పడేయొద్దు. బైక్, స్కూటరిస్టులకు ఇది పెద్ద ప్రమాదం కావచ్చు.

  • పక్షుల భద్రతను గుర్తుంచుకోండి: పక్షులు తీగలకు చిక్కుకుని గాయపడకుండా ఉండేలా చూడాలి. దారాలను రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పడేయకుండా డస్ట్‌బిన్‌లోనే వేయాలి.

  • బాల్కనీ లేదా టెర్రస్‌పై జాగ్రత్త: ఎత్తైన భవనాలపై నుంచి వంగి గాలిపటం పట్టుకోవడం ప్రమాదకరం. జారిపడే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

  • సురక్షితమైన పద్ధతుల్లో గాలిపటాలు ఎగురవేస్తే పండుగ మరింత సంతోషంగా, ప్రమాదం లేకుండా సాగుతుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.

Also Read:

తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?

జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?

For More Latest News

Updated Date - Jan 13 , 2026 | 02:54 PM