రాయలసీమ ఉక్కు కల సాకారం..రూ.16,350 కోట్ల JSW స్టీల్ ప్లాంట్ ప్రారంభం

ABN, Publish Date - Jul 03 , 2026 | 09:49 PM

కడప జిల్లాలోని జమ్మలమడుగు మండలం సున్నపురళ్లపల్లెలో రూ.16,350 కోట్లతో నిర్మించనున్న ప్రతిష్టాత్మక జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్‌ను సరికొత్త పారిశ్రామిక హబ్‌గా, ముఖ్యంగా 'స్టీల్ స్టేట్'గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కడప జిల్లాలోని జమ్మలమడుగు మండలం సున్నపురళ్లపల్లెలో రూ.16,350 కోట్లతో నిర్మించనున్న ప్రతిష్టాత్మక జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా గ్రీన్ స్టీల్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. కేవలం విశాఖపట్నం మాత్రమే కాకుండా, రాయలసీమ ప్రాంతాన్ని కూడా 'ఉక్కుసీమ'గా మారుస్తామని హామీ ఇచ్చారు.


ఇవి చదవండి

మందుల కొనుగోలు, పంపిణీ వ్యవస్థ ప్రక్షాళన కోసం ప్రత్యేక కమిటీ..

ఎల్‌నినో ఎఫెక్ట్: ఖరీఫ్ సాగుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Updated at - Jul 03 , 2026 | 09:50 PM