మందుల కొనుగోలు, పంపిణీ వ్యవస్థ ప్రక్షాళన కోసం ప్రత్యేక కమిటీ..
ABN , Publish Date - Jul 03 , 2026 | 09:25 PM
వైద్యారోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దాదాపు 4 గంటల పాటు ఈ సమీక్ష సమావేశం సాగింది.
ఇంటర్‌నెట్ డెస్క్: వైద్యారోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దాదాపు 4 గంటల పాటు ఈ సమీక్ష సమావేశం సాగింది. ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు మంత్రి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. మందుల కొనుగోలు, పంపిణీ వ్యవస్థ ప్రక్షాళన కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
రోగుల అవసరాలకు తగ్గట్లు తీసుకోవాల్సిన చర్యలపై రెండు వారాల్లోగా నివేదిక అందించాలని స్పష్టం చేశారు. పరికరాలు, మిషన్ల కొనుగోలు, సరఫరాకు నిర్ధిష్ట క్యాలెండర్‌ను రూపొందించాలని ఆదేశించారు. ఆసుపత్రుల భవన నిర్మాణ పనుల్లో వేగాన్ని పెంచాలన్నారు.
ఇవి కూడా చదవండి
బాతును అమాంతం మింగేసిన కొండచిలువ.. తర్వాత ఏం జరిగిందంటే..
రైతు భరోసా నిధుల విడుదలలో రేవంత్ సర్కార్ రికార్డు