భయపడే పార్టీ మాది కాదు..!
ABN, Publish Date - Feb 13 , 2026 | 09:38 PM
వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్‌పై కాషాయ జెండా ఎగరవేస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఓవైసీ కళ్లలో ఆనందం కోసమే జీహెచ్‌ఎంసీని ముక్కుల చేశారని మండిపడ్డారు.
కరీంనగర్, ఫిబ్రవరి 13: వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్‌పై కాషాయ జెండా ఎగరవేస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఓవైసీ కళ్లలో ఆనందం కోసమే జీహెచ్‌ఎంసీని ముక్కుల చేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పాలిట అదే మరణ శాసనం కాబోతోందన్నారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో బీజేపీ 30 డివిజన్లను కైవసం చేసుకుంది. దీనిపై కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు.
తెలంగాణలో తొలిసారి కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగరేశామని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు పట్టించుకో లేదన్నారు. కాంగ్రెస్‌తో సంసారం చేస్తూ బీఆర్ఎస్‌కు కన్ను కొడుతున్న ఎంఐఎంను ప్రజలు చెంప చెళ్లుమన్పించారని చెప్పారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా కరీంనగర్‌ను అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.
Updated at - Feb 13 , 2026 | 09:53 PM