జడ్పీ చైర్మన్ పీఠాలపై కూటమి పార్టీల కసరత్తు

ABN, Publish Date - Nov 17 , 2026 | 09:27 AM

ఏపీలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పీఠాలపై ఎవరెవరు కొలువుతీరుతారన్న దానిపై కూటమి పార్టీల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 20న జడ్పీ చైర్మన్ల ఎన్నిక జరగనున్న నేపథ్యంలో కూటమి పార్టీల అగ్రనేతలు కసరత్తు ముమ్మరం చేశారు.

అమరావతి, నవంబర్17: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పీఠాలపై ఎవరెవరు కొలువుతీరుతారన్న దానిపై కూటమి పార్టీల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 20న జడ్పీ చైర్మన్ల ఎన్నిక జరగనున్న నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ అగ్రనేతలు కసరత్తు ముమ్మరం చేశారు. మొత్తం 28 జిల్లా పరిషత్ స్థానాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా మినహా మిగిలిన 27 జడ్పీలను కూటమి కైవసం చేసుకుంది. అయితే చైర్‌పర్సన్ స్థానాల పంపకంపై కూటమి నేతల మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. పార్టీని ఆది నుంచి నమ్ముకున్న వారికి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మధ్య పోటీ నెలకొంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కోసం పై వీడియోను వీక్షించండి.


ఇవి కూడా చదవండి:

కోనసీమ జిల్లాలో భారీ శబ్దాలతో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు

పంజాబ్‌లో మరో పోలీసు హత్య.. తెహ్రీక్-ఎ-తాలిబన్‌ సంస్థపై అనుమానాలు

Updated at - Nov 17 , 2026 | 09:27 AM