జగన్ సొంతూరులో కూటమి ఏకగ్రీవం..
ABN, Publish Date - Nov 29 , 2026 | 09:21 PM
ఆంధ్రప్రదేశ్లో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కూటమి జోరు కొనసాగుతోంది. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సొంతూరు బలపనూరులో కూటమి అభ్యర్థి ఏకగ్రీవం కావడం సంచలనంగా మారింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు చర్చ మొదలైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కూటమి జోరు కొనసాగుతోంది. 27 జిల్లాల్లో 246 మండలాల్లో ఇవాళ (ఆదివారం) ఎన్నికలు జరిగాయి. 3,803 సర్పంచ్, 29,603 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఫలితాల్లో ఇప్పటివరకూ 12 వందలకు పైగా పంచాయతీల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. మరోవైపు, 1,171 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అయితే, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సొంతూరు బలపనూరులో కూటమి అభ్యర్థి ఏకగ్రీవం కావడం చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలు వీడియోపై క్లిక్ చేసి వీక్షించండి..
ఈ వార్తలు కూడా చదవండి
డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుంది: చింతా మోహన్
పంచాయతీ ఎన్నికల్లో కూటమి జోరు.. అవమానంతో రెచ్చిపోతున్న వైసీపీ..!
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
Updated at - Nov 29 , 2026 | 09:24 PM