తుది దశకు సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం.. ఓపెనింగ్ ఆరోజే..

ABN, Publish Date - Aug 05 , 2026 | 09:11 AM

రాజధాని అమరావతికి రాచబాట అయిన సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు ఫేజ్‌-2, స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి.

రాజధాని అమరావతికి రాచబాట అయిన సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు ఫేజ్‌-2, స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ రహదారి నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న భూములను భూసేకరణ ద్వారా తీసుకున్న తరువాత యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో 2 వారాల్లోపే సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు ముఖచిత్రం మారిపోయింది. సీడ్‌ యాక్సిస్‌ (ఈ-3) రోడ్డు మొత్తం పొడవు 21.78 కి.మీ. కాగా దొండపాడు నుంచి వెంకటపాలెంలోని మంతెన ఆశ్రమం వరకూ ఫేజ్‌-1 కింద 14.35 కి.మీ. రోడ్డు ఇప్పటికే పూర్తయింది, ఫేజ్‌-2 కింద 3.92 కి.మీ రోడ్డుతో పాటు ఫేజ్‌-3 కింద 3.51 కి.మీ. మేర ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Aug 05 , 2026 | 09:11 AM