ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో చర్లపల్లిలో ఘనంగా ముగ్గుల పోటీలు

ABN, Publish Date - Jan 05 , 2026 | 05:52 PM

హైదరాబాద్‌లోని చర్లపల్లిలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీ అట్టహాసంగా సాగింది. మహిళలు, యువతులు భారీగా తరలివచ్చి.. రంగు రంగుల ముగ్గులతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

హైదరాబాద్, జనవరి 5: చర్లపల్లిలోని ఈసీ నగర్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీ అట్టహాసంగా సాగింది. మహిళలు, యువతులు భారీగా తరలివచ్చి.. రంగు రంగుల ముగ్గులతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు బొంతు శ్రీదేవి యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముగ్గుల పోటీల్లో గెలిచిన వారికి ఆమె బహుమతులు అందజేశారు. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో మహిళ పాత్ర ఎంతో ముఖ్యమని ఆమె తెలిపారు. ఈ ముగ్గులు పోటీలు నిర్వహించిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలకు మహిళలు, యువతులు కృతజ్ఞతలు తెలిపారు.


ఇవి కూడా చదవండి...

ఆత్మహత్యకు పాల్పడ్డ జూనియర్ డాక్టర్ మృతి

శాసనమండలిలో ఇదే నా చివరి ప్రసంగం: కవిత

Updated at - Jan 06 , 2026 | 05:18 PM