కూలీ బ్యాచ్‌తో ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై విష ప్రచారం

ABN, Publish Date - Jan 27 , 2026 | 09:32 PM

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి. పల్లెపల్లెన సాగిన ఉద్యమ స్ఫూర్తిని అక్షరాయుధంతో ఊపిరి పోసింది. ఉక్కు సంకల్పంతో ప్రత్యేక రాష్ట్ర కాంక్షకు బేషరతుగా మద్దతు ప్రకటించింది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి. పల్లెపల్లెన సాగిన ఉద్యమ స్ఫూర్తిని అక్షరాయుధంతో ఊపిరి పోసింది. ఉక్కు సంకల్పంతో ప్రత్యేక రాష్ట్ర కాంక్షకు బేషరతుగా మద్దతు ప్రకటించింది. ఈ విషయాన్ని అధికారికంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఆపాలంటే, ఉద్యమకారులను ఉక్కుపాదంతో అణచివేయాలంటే.. ఉద్యమ వార్తల కవరేజీ తగ్గించాలని... ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి లాంటి నిఖార్సైన మీడియాను కట్టడి చేయాలని కుండబద్దలు కొట్టింది శ్రీకృష్ణ కమిటీ. తెలంగాణపై ఆంధ్రజ్యోతి నిబద్ధతతకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ప్రత్యేక రాష్ట్ర సాధనలో తనవంతు పాత్ర పోషించిన ఏబీఎన్ - ఆంధ్రజ్యోతిని ఇప్పుడు బదనాం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. కొందరు స్వార్థపరులు కూలీ బ్యాచ్‌తో సోషల్‌ మీడియాలో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతిపై విషప్రచారం చేస్తున్నారు. ఏది నిజం ఏది అబద్దమో నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.


ఇవి కూడా చదవండి

కాంగ్రెస్ సమావేశానికి మరోసారి శశి థరూర్ డుమ్మా.. ఈ సారి కారణమేంటంటే..

యాసిడ్ దాడి కేసుల్లో నిందితుల ఆస్తులు ఎందుకు వేలం వేయకూడదు.. ప్రశ్నించిన సుప్రీం

Updated at - Jan 27 , 2026 | 09:36 PM