తెనాలిలో 130 రకాల వంటలతో కొత్త అల్లుడికి విందు భోజనం

ABN, Publish Date - Jan 15 , 2026 | 04:51 PM

గోదావరి జిల్లాల్లో పలు రకాల వంటలు వండి.. కొత్త అల్లుళ్లకు పెట్టే సంప్రదాయం ప్రస్తుతం గుంటూరు జిల్లాకు విస్తరించింది. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగకు వచ్చే కొత్త అల్లుళ్లకు పలు రకాల పిండి వంటలు వండి పెడుతున్నారు.

గోదావరి జిల్లాల్లో పలు రకాల వంటలు వండి.. కొత్త అల్లుళ్లకు పెట్టే సంప్రదాయం ప్రస్తుతం గుంటూరు జిల్లాకు విస్తరించింది. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగకు వచ్చే కొత్త అల్లుళ్లకు వివిధ రకాల వంటలు వండి పెడుతున్నారు. తెనాలి నందుల పేటకు చెందిన కనిగిచర్ల రమాకాంత్, బేబీ దంపతులు.. తమ అల్లుడు సుదీష్ కుమార్‌కు భారీ విందు ఏర్పాటు చేశారు. 130 రకాల వంటలతో అల్లుడికి విందు ఏర్పాటు చేశారు. అలా కొత్త అల్లుడు, కుమార్తెకు భారీ విందు ఇచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చారు. తద్వారా తెనాలిలో కొత్త సంప్రదాయానికి తెర తీశారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

గాంధీ భవన్‌లో పాము కలకలం

పల్లె వాతావరణంలో ప్రత్యేక సెట్.. విశాఖలో సంక్రాంతి సంబరాలు

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jan 15 , 2026 | 05:02 PM