చలికాలంలో ఏ పిండి రొట్టెలు తింటే మంచిది? జొన్న, రాగి, మొక్కజొన్నలో ఏది బెస్ట్?
ABN , Publish Date - Nov 12 , 2026 | 02:00 PM
చలికాలంలో కొందరు రాగిపిండితో చేసిన రొట్టెలను ఇష్టపడతారు. మరికొందరు జొన్న రొట్టెలకు ఓటేస్తారు. మరి చలికాలంలో ఏ పిండితో చేసిన రొట్టెలను తినాలి..?
ఇంటర్నెట్ డెస్క్: చలికాలంలో వచ్చిందంటే మన ఆహారపు అలవాట్లు మారిపోతాయి. ఈ కాలంలో కొందరు రాగిపిండితో చేసిన రొట్టెలను ఇష్టపడతారు. మరికొందరు జొన్న రొట్టెలకు ఓటేస్తారు. మరి చలికాలంలో ఏ పిండితో చేసిన రొట్టెలను తినాలి..? ఏది ప్రయోజనకారి..? సాధారణంగా మొక్కజొన్న, రాగి, జొన్న గోధుమ.. వీటన్నింటిలోనూ ప్రత్యేక గుణాలు, పోషక విలువలూ ఉంటాయి. కాబట్టి వీటిలో ఏ పిండితో చేసిన రొట్టెలను శీతాకాలంలో తినడం మంచిదో తెలుసుకుందాం.
జొన్న పిండి
జొన్న పిండికి ప్రత్యేకమైన భారతీయ రుచి ఉంటుంది. వేడి వేడి జొన్న రొట్టెపై నెయ్యి పూసి, ఆకుకూరతో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. జొన్నలో పీచుపదార్థం, ఐరన్ వంటి పోషక గుణాలుంటాయి. కాబట్టి చలికాలంలో జొన్న రొట్టెలు మంచి ఎంపిక.
మొక్కజొన్న పిండి
మొక్కజొన్న రొట్టె పేరు చెబితే ఆవాల ఆకుకూర గుర్తుకొస్తుంది. శీతాకాలంలో పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలు దీన్ని ఇష్టంగా తింటారు. వెన్నతో పాటు ఈ రొట్టెను తీసుకుంటే రుచి అదిరిపోతుంది. అయితే మొక్కజొన్న పిండితో రొట్టెలు చేయడం కొంచెం కష్టం.
రాగిపిండి
రాగిలో కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఈ పిండికి విలక్షణమైన రుచి ఉంటుంది. రొట్టెలు చేసేటప్పుడు పిండిని కలపడం కష్టంగా ఉంటే గోరువెచ్చని నీటిని వాడొచ్చు. పెరుగుతో కలిపి రాగిపిండి రొట్టెను తింటే బావుంటుంది.
గోధుమ పిండి
గోధుమ పిండి భారతీయ ఇళ్లలో నిత్యం కనిపిస్తుంది. దీనితో రొట్టెలు చేయడం చాలా సులభం. గోధుమలోని గ్లూటెన్ కారణంగా పిండిని కలిపి, రొట్టెలు చేయడంలో ఎలాంటి కష్టమూ ఉండదు. ఈ పిండితో చేసిన రొట్టెలు మృదువుగా ఉంటాయి.
చలికాలంలో ఏది బెస్ట్?
ఈ నాలుగు రకాల పిండి పదార్ధాల్లో ఒక దాన్ని బెస్ట్ అని చెప్పడం సరికాదు. రుచి కోరుకుంటే జొన్న పిండికి ప్రాధాన్యం ఇవ్వాలి. గ్లూటెన్ రహిత రొట్టెలు కావాలనుకునే వారు రాగి పిండిని ఎంచుకోవచ్చు. రోజువారీ వాడకానికి గోధుమ పిండి మంచిది.
ఈ వార్తలూ చదవండి
నోరూరించే పంజాబీ కాతీ రోల్.. తయారీ ఇంత సులభమా..
వంటలు: కొబ్బరి పేడా.. తయారు చేసుకోండిలా..