పెసరపప్పు క్యారెట్ సలాడ్
ABN , Publish Date - Apr 03 , 2026 | 01:26 PM
కావలసిన పదార్థాలు: పెసరపప్పు - అర కప్పు, క్యారెట్ తురుము - అర కప్పు, పచ్చి కొబ్బరి తురుము - పావు కప్పు, కొత్తిమీర తరుగు -
కావలసిన పదార్థాలు: పెసరపప్పు - అర కప్పు, క్యారెట్ తురుము - అర కప్పు, పచ్చి కొబ్బరి తురుము - పావు కప్పు, కొత్తిమీర తరుగు - స్పూను, దానిమ్మ పళ్లు - రెండు స్పూన్లు, నిమ్మ రసం - అర స్పూను, పచ్చి మిర్చి ముక్కలు - అర స్పూను, కరివేపాకు రెబ్బలు - కొన్ని, నూనె, ఉప్పు - తగినంత, పోపు గింజలు - స్పూను.
తయారుచేసే విధానం: పెసరపప్పును గంటసేపు నీళ్లలో నానబెట్టి వడకట్టి, కాసేపు ఆరబెట్టాలి. ఐదు నిమిషాల తరవాత ఓ గిన్నెలో పెసరపప్పు, క్యారెట్, పచ్చికొబ్బరి, మిర్చి కలపుకోవాలి. కొత్తిమీర, ఉప్పు, నిమ్మరసాన్ని చేర్చి, పోపుపెడితే సరి. కప్పుల్లో వేసి అందరికీ అందించే ముందు అలంకరణగా దానిమ్మ గింజల్ని వేయడం మరచిపోకూడదు.
ఈ వార్తలు కూడా చదవండి:
మరో 260 వందేభారత్ స్లీపర్ రైళ్ల తయారీ
అత్యాధునిక యుద్ధనౌక 'INS తారాగిరి' విశాఖలో జలప్రవేశం
Read Latest Telangana News and National News