Share News

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

ABN , Publish Date - Nov 27 , 2026 | 01:41 AM

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో భార్య

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
arrest

  • వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఘాతుకం

  • ఫిట్స్‌తో మరణించాడని నాటకం.. ములుగు జిల్లాలో ఘటన

వెంకటాపురం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో భార్య. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. వెంకటాపురంలోని బీసీ మర్రిగుడెం డబుల్‌ బెడ్‌రూం సముదాయంలో నివసిస్తున్న పూనెం నాగరాజు(31), పూనెం నాగజ్యోతి 12 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నాడు. నాగరాజు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో నాగజ్యోతికి బేస్తగూడేనికి చెందిన సత్యంతో పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలుసుకున్న నాగరాజు.. పద్ధతి మార్చుకోవాలని వారిద్దరినీ హెచ్చరించాడు. దీంతో అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న వారిద్దరూ.. బుధవారం అర్ధరాత్రి నాగరాజును తీవ్రంగా కొట్టి, గొంతు నులిమి చున్నీతో ఉరివేసి హత్య చేశారు. ఆ తర్వాత నాగరాజుకు ఫిట్స్‌ వచ్చిందని చెప్పి 108అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నాగరాజు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. పోలీసుల విచారణలో సత్యంతో కలిసి నేరం చేసినట్లు నాగజ్యోతి అంగీకరించింది. నాగజ్యోతి, సత్యంను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆధారాలను సేకరిస్తున్నారు

ఈ వార్తలనూ చదవండి:

2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు

బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా

Updated Date - Nov 27 , 2026 | 01:47 AM