పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తెలంగాణ రక్షణ సేన అభ్యర్థి ఖరారు
ABN , Publish Date - Oct 20 , 2026 | 12:23 PM
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తెలంగాణ రక్షణ సేన అభ్యర్థిని ఖరారు చేసింది. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను తమ అభ్యర్థిగా పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రకటించారు.
వరంగల్ జిల్లా: వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తెలంగాణ రక్షణ సేన అభ్యర్థిని ఖరారు చేసింది. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను తమ అభ్యర్థిగా పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీకాంత్ గౌడ్ పేరు ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
మరోవైపు, ఈ ఎన్నికల దృష్ట్యా వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల పరిధిలోని పట్టభద్రులను లక్ష్యంగా చేసుకుని ఎన్నికల కార్యాచరణను కవిత ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ, ప్రచార వ్యూహాల సమన్వయం కోసం సయ్యద్ ఇస్మాయిల్‌ను ఎన్నికల కోఆర్డినేటర్, అబ్జర్వర్‌గా నియమించారు కవిత. ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం, ప్రచార కార్యక్రమాల పర్యవేక్షణలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. దసరా సందర్భంగా అభ్యర్థి ప్రకటనతో పాటు ఎన్నికల బాధ్యతలనూ తెలంగాణ రక్షణ సేన ఖరారు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రానున్న రోజుల్లో పట్టభద్రుల మద్దతు కూడగట్టేందుకు పార్టీ ఎలాంటి కార్యాచరణ చేపడుతుంది, అభ్యర్థి ప్రచారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారన్నది మరింత ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రక్షణ సేన నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ పేరు ఖరారు కావడంతో వరంగల్-ఖమ్మం-నల్లగొండ రాజకీయాల్లో ఈ ప్రకటన చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. కారు అదుపుతప్పి ఒకరి మృతి..
ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలి..: గవర్నర్, సీఎం దసరా శుభాకాంక్షలు