NIA Raids Orphanage: గాదె ఇన్నయ్య అనాథాశ్రమంలో కొనసాగుతున్న ఎన్ఐఏ సోదాలు
ABN , Publish Date - Jan 13 , 2026 | 06:03 PM
మావోయిస్టు అగ్రనేత కాటా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియల నేపథ్యంలో గాదె ఇన్నయ్య చేసిన వ్యాఖ్యలను ఎన్ఐఏ తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసింది.
వరంగల్, జనవరి13: మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారంటూ సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యకు చెందిన అనాథాశ్రమంలో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) సోదాలను ముమ్మరం చేసింది. జనగామ జిల్లా జాఫర్‌గఢ్ మండల కేంద్రంలోని ఆయన నిర్వహిస్తున్న అనాథాశ్రమానికి మంగళవారం ఉదయం నాలుగు కార్లలో ఎన్ఐఏ అధికారులు వచ్చారు. ఎన్ఐఏ సిబ్బందితో ఉదయం నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
వీరంతా బృందాలుగా విడిపోయి.. ఆశ్రమంలో రికార్డులు, కంప్యూటర్లతో పాటు పలు పత్రాలను నిశీతంగా పరిశీలిస్తున్నారు. అనాథాశ్రమంలో ఎన్ఐఏ సోదాలు చేస్తుండటంతో.. మీడియా ఆ ప్రాంతానికి చేరుకుంది. పటిష్ఠమైన భద్రత నడుమ ఈ సోదాలు జరుగుతున్న వేళ.. మీడియాను లోపలకు అనుమతించలేదు.
2026 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టింది. మావోయిస్టులు లొంగిపోయి.. జన జీవన స్రవంతిలో కలవాలని కేంద్రం పిలుపునిచ్చింది. తద్వారా దేశాభివృద్ధిలో భాగం కావాలంటూ మావోయిస్టులకు స్పష్టం చేసింది. దీంతో వందలాది మంది మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని పలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భారీగా ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయి.
ఈ ఎన్‌కౌంటర్లలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు సైతం ఉన్నారు. వారిలో కాటా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ ఇటీవల మరణించారు. ఈ సందర్భంగా మావోయిస్టులకు అనుకూలంగా గాదె ఇన్నయ్య తీవ్ర వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. ప్రజలనూ ఆయన ప్రేరేపించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఉపా(UAPA) చట్టం కింద ఆయనపై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఆ క్రమంలో డిసెంబర్ 21న ఇన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
దారుణం.. రైలు పట్టాలపై గర్భిణీ ప్రసవం
కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభం
Read Latest AP News And Telugu News