Share News

ములుగు జిల్లాలో విషాదం.. పాము కాటుతో ఆరునెలల బాలుడు మృతి

ABN , Publish Date - Sep 27 , 2026 | 07:22 PM

ఓ పాము అప్పటివరకు తల్లిదండ్రుల ఒడిలో ఆడుకున్న ఆరునెలల చిన్నారి ప్రాణాలను తీసింది. బాలుడిని క్షణాల్లోనే విగతజీవిగా మార్చి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం వెంగలాపూర్‌లో చోటుచేసుకుంది.

ములుగు జిల్లాలో విషాదం.. పాము కాటుతో ఆరునెలల బాలుడు మృతి
Snake Bite

ములుగు జిల్లా: ఓ పాము అప్పటివరకు తల్లిదండ్రుల ఒడిలో ఆడుకున్న ఆరునెలల చిన్నారి(Snake Bite) ప్రాణాలను తీసింది. బాలుడిని క్షణాల్లోనే విగతజీవిగా మార్చి కుటుంబ సభ్యులు, బంధువులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన ములుగు జిల్లా (Mulugu District) తాడ్వాయి మండలం వెంగలాపూర్‌లో చోటుచేసుకుంది.


వెంగలాపూర్ గ్రామానికి చెందిన ఈక తిరుపతి, స్వప్న దంపతులకు ఆరునెలల కుమారుడు ఉన్నాడు. రోజూ మాదిరిగానే బాబును మంచంపై పడుకోబెట్టి తల్లిదండ్రులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే, ఇంటి ప్రాంగణంలోకి వచ్చిన ఓ పాము.. మంచంపై ఉన్న చిన్నారిని కాటేసింది. అనంతరం అక్కడి నుంచి అది వెళ్లిపోతుండగా తల్లి స్వప్న గుర్తించింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బాబును ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. సకాలంలో వైద్యం అందించేందుకు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే, అంబులెన్స్ ఆలస్యంగా రావడంతో బాలుడి పరిస్థితి విషమించింది.


బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. అప్పటివరకు తమ ఇంట్లో తిరిగిన చిన్నారి విగతజీవిగా మారడంతో కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సకాలంలో వైద్య సహాయం అంది ఉంటే చిన్నారి ప్రాణాలతో ఉండేవాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఘటనతో వెంగలాపూర్‌లో విషాదం నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి

ఫేస్‌బుక్ పరిచయం.. ట్రేడింగ్ పేరుతో డాక్టర్‌కు రూ.14.61 కోట్ల టోకరా..

హైదరాబాద్‌లో దారుణం.. భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త

Updated Date - Sep 27 , 2026 | 07:31 PM