Share News

భార్యపై బ్యాట్‌తో దాడి చేసి పిల్లలను ఎత్తుకెళ్లిన భర్త

ABN , Publish Date - Aug 04 , 2026 | 11:39 AM

జనగామ జిల్లాలోని జనగామ మండలం ఓబుల్ కేశవపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యపై దాడి చేసిన భర్త.. ఆపై పిల్లలను ఎత్తుకెళ్లడం కలకలం రేపుతోంది.

భార్యపై బ్యాట్‌తో దాడి చేసి పిల్లలను ఎత్తుకెళ్లిన భర్త
Jangaon News

జనగామ, ఆగస్టు 4: జిల్లాలోని జనగామ మండలం ఓబుల్ కేశవపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యపై దాడి చేసిన భర్త.. ఆపై పిల్లలను ఎత్తుకెళ్లడం కలకలం రేపుతోంది. మహేందర్ రెడ్డి, మాధవి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మహేందర్ రెడ్డికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉందంటూ భార్య మాధవి నిలదీసింది. ఈ విషయంపై ఇరువురి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. కోపంతో ఊగిపోయిన భర్త.. బేస్ బాల్ బ్యాట్‌తో భార్యపై దాడి చేశాడు. దీంతో మహిళ తీవ్రంగా గాయపడింది.


భార్యపై దాడి చేసిన అనంతరం మహేందర్.. ఇద్దరు పిల్లలను ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లిపోయాడు. స్థానికుల సాయంతో మాధవి పోలీసులను ఆశ్రయించింది. భర్త తనపై దాడి చేసి పిల్లలను తీసుకెళ్లిపోయాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహేందర్ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గాయపడిన మాధవిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


ఇవి కూడా చదవండి...

కిడ్నాప్ కేసు.. గుజరాత్‌‌లో వైసీపీ నేత ముస్తఫా అరెస్ట్

పెద్దపులి మృతి కేసులో ఇద్దరు అనుమానితుల అరెస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 04 , 2026 | 11:47 AM