ఎన్నిక వాయిదా వేయడం దుర్మార్గం: ఎర్రబెల్లి దయాకర్ రావు
ABN , Publish Date - Feb 16 , 2026 | 04:09 PM
తొర్రూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదాపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికను వాయిదా వేయడం దుర్మార్గమని అన్నారు..
మహబూబాబాద్ జిల్లా: తొర్రూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడిన నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికను వాయిదా వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన విమర్శించారు..
ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. పరిస్థితులు సజావుగా ఉన్నప్పటికీ ఎన్నికను వాయిదా వేయడం దుర్మార్గమని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రజల తీర్పును గౌరవించకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ వైఖరిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌ను సంప్రదించేందుకు ఫోన్ చేసినా స్పందించలేదని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. తొర్రూర్ మున్సిపల్ ఎన్నిక వాయిదా నేపథ్యంలో జిల్లా రాజకీయాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
చైర్మన్ ఎన్నిక వేళ.. ఇస్నాపూర్‌లో బిగ్ ట్విస్ట్
హస్తం ఖాతాలో నిజామాబాద్ మేయర్ పీఠం
For More TG News And Telugu News