Share News

వినాయక చవితి వేడుకల్లో విషాదం.. గుండెపోటుతో పూజారి మృతి

ABN , Publish Date - Sep 14 , 2026 | 07:28 PM

వినాయక చవితి వేడుకలు జరుగుతున్న వేళ నల్లగొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గణేష్ మండపంలో పూజలు నిర్వహిస్తున్న పూజారి దత్తు (65) ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలారు. ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

వినాయక చవితి వేడుకల్లో విషాదం.. గుండెపోటుతో పూజారి మృతి
Vinayaka Chavithi 2026

నల్లగొండ, సెప్టెంబర్ 14: జిల్లాలో వినాయక చవితి వేడుకల్లో విషాద ఘటన ఘటన చోటుచేసుకుంది. తిరుమలగిరి సాగర్ మండలం చింతపాలెం గ్రామంలో గణేష్ మండపంలో పూజలు నిర్వహిస్తుండగా పూజారి దత్తు (65) గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడున్న వారు ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే మార్గమధ్యంలోనే దత్తు మృతి చెందారు. దీంతో గ్రామంలోవిషాదం నెలకొంది.


ఇదిలా ఉండగా.. గణేష్ ఉత్సవాల సందర్భంగా గ్రామంలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఉద్రిక్తతకు దారితీసినట్లు తెలుస్తోంది. తమ మండపంలోనే తొలిపూజ నిర్వహించాలని ఇరు వర్గాలు పట్టుబట్టడంతో పాటూ పూజారి దత్తుతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. పరిస్థితి తీవ్రతరం కాకుండా గ్రామంలోని పెద్ద మనుషులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పారు. అనంతరం పరిస్థితి సద్దుమణగడంతో దత్తు ఓ గణేష్ మండపం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు.


ఇవి కూడా చదవండి...

నల్లగొండలో కేటీఆర్‌ పాదయాత్ర చేస్తే.. నేనూ చేస్తా: మంత్రి కోమటిరెడ్డి

బీఆర్ఎస్‌కు దమ్ముంటే తలసానికి ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వాలి: మహేశ్ గౌడ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 14 , 2026 | 08:33 PM