కో-లివింగ్ హాస్టల్స్‌పై కమిటీ వేయాలి: ప్రభుత్వ సలహాదారు వీహెచ్
ABN , Publish Date - Jun 10 , 2026 | 01:42 PM
ప్రస్తుత ఆధునిక సమాజంలో యువతీ యువకులు కలిసి ఉండే 'కో లివింగ్ హాస్టల్స్' సంస్కృతిపై సర్వత్రా ఆందోళనలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్, జూన్ 10: ప్రస్తుత సమాజంలో యువతీ యువకులు కలిసి ఉండే 'కో లివింగ్ హాస్టల్స్' సంస్కృతిపై సర్వత్రా చర్చ నడుస్తున్న వేళ.. ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు (వీహెచ్) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ హాస్టల్స్ నిర్వహణ తీరు, అక్కడ అసలు ఏం జరుగుతోంది, యువత ఏ విధంగా ప్రభావితమవుతోంది అనే అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏబీఎన్‌తో వీహెచ్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నడుస్తున్న కో-లివింగ్ హాస్టల్స్‌లో అసలు ఏం జరుగుతుందో క్షుణ్ణంగా పరిశీలించాలి. అక్కడ చోటుచేసుకుంటున్న పరిస్థితులపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలి. అలా చేసిన తర్వాతే వాటిని పూర్తిగా రద్దు చేయాలా? లేక కఠినమైన నిబంధనలను అమలు చేయాలా? అన్న విషయంపై స్పష్టత వస్తుంది. ఇలాంటి హాస్టల్స్ పరిధిలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే సమాజంలో, మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కో-లివింగ్ హాస్టల్స్‌లో అమ్మాయిల తప్పా? లేక అబ్బాయిల తప్పా? తెలుసుకోవాలి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే కమిటీ ద్వారా సమగ్ర విచారణ జరిపించి, నివేదిక ఆధారంగా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి..
బాలకృష్ణకు సీఎం చంద్రబాబు, లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు
యోగా మన జీవితంలో భాగం కావాలి: వసంత కృష్ణప్రసాద్
Read Latest AP News And Telugu News