తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్
ABN , Publish Date - Mar 13 , 2026 | 06:53 PM
తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. టీజీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. శుక్రవారం నాడు బస్ భవన్‌లో ఆర్టీసీ ఉన్నతాధికారులకు జేఏసీ నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు.
హైదరాబాద్, మార్చి 13: తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. టీజీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. శుక్రవారం నాడు బస్ భవన్‌లో ఆర్టీసీ ఉన్నతాధికారులకు జేఏసీ నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. అనంతరం లేబర్ కమిషనర్ కార్యాలయంలో సమ్మె నోటీసు ఇచ్చారు జేఏసీ నేతలు. ఆర్టీసీ సమ్మె తేదీపై 14 రోజుల తరువాత నిర్ణయం తీసుకుంటామని.. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్లడం ఖాయమని జేఏసీ నేతలు తేల్చి చెప్పారు.
జేఏసీ నేతల డిమాండ్లివే..
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే చేపట్టాలి.
2021 వేతన సవరణ 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలి.
మహాలక్ష్మి పథకం కింద ప్రతినెలా రూ.350 కోట్లు కోత లేకుండా ఇవ్వాలి.
పాత బకాయిలు రూ.2,500 కోట్లు వెంటనే విడుదల చేయాలి.
ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి.
ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలి.
అన్ని కేటగిరీల్లో పనిచేసే ఉద్యోగులపై అధిక పనిభారం తగ్గించాలి.
Also Read:
ఫుట్‌బాల్ ఆడుతూ మైదానంలోనే కుప్పకూలిన యువ ప్లేయర్
గ్యాస్ కొరత ఎఫెక్ట్: ఏపీలో హోటళ్ల పనివేళల తగ్గింపు? మంత్రి పయ్యావులతో అసోసియేషన్ భేటీ
విమానంలో దుబాయ్‌కి వెళ్లిన మహిళ.. ఇంత రిస్క్ ఎందుకో తెలిస్తే..