Share News

రాష్ట్రంలో వచ్చేది టీఆర్‌పీ ప్రభుత్వమే..

ABN , Publish Date - May 02 , 2026 | 09:32 AM

రాష్ట్రంలో 2028లో టీఆర్‌పీ అధికారంలోకి వచ్చి తీరుతుందని, బీసీల ప్రభుత్వం ఏర్పడబోతుందని ఆ పార్టీ వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో వచ్చేది టీఆర్‌పీ ప్రభుత్వమే..
Teenmar Mallanna

  • జూన్‌ 2 నుంచి పాదయాత్ర

  • ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న

హైదరాబాద్: రాష్ట్రంలో 2028లో టీఆర్‌పీ అధికారంలోకి వచ్చి తీరుతుందని, బీసీల ప్రభుత్వం ఏర్పడబోతుందని ఆ పార్టీ వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ మావోయిస్టు, దళకమాండర్‌ పటేల్‌ వనజ ఆధ్వర్యంలో పలు సంఘాల నేతలు, మహిళా నాయకురాళ్లు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. వారికి తీన్మార్‌ మల్లన్న పార్టీ కండువా కప్పి టీఆర్‌పీలోకి ఆహ్వానించారు.


city4,2.jpgఈ సందర్భంగా తీన్మార్‌ మల్లన్న మాట్లాడుతూ టీఆర్‌పీని బలోపేతం చేయడానికి జూన్‌ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. భువనగిరిలో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నామని, వేలాదిమంది మాజీ మావోయిస్టులతో మహాగర్జన నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. మాజీ మవోయిస్టు పలేట్‌ వనజ మాట్లాడుతూ మేము అనుకున్న మార్పులను చట్టాల రూపంలో తీసుకురావడానికి ఇది చివరి అవకాశంగా భావించి టీఆర్‌పీలో చేరామని చెప్పారు.

Updated Date - May 02 , 2026 | 09:32 AM