విషాదం.. నీటి సంపులో పడి మూడేళ్ల చిన్నారి మృతి
ABN , Publish Date - May 10 , 2026 | 12:01 PM
రంగారెడ్డి జిల్లా జన్వాడ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారి నీటి సంపులో పడి మృతి చెందడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే..
రంగారెడ్డి, మే 10: జిల్లాలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. జన్వాడ గ్రామంలో మూడేళ్ల చిన్నారి నీటి సంపులో పడి మృతి చెందడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. గ్రామానికి చెందిన కాట్నే శేఖర్ కుమార్తె ప్రియాన్షు (3) ఆదివారం ఇంటి సమీపంలో ఆడుకుంటూ ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. చిన్నారి ఆచూకీ దొరకకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, స్థానికులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఈ క్రమంలో ఇంటి సమీపంలోనే ఉన్న నీటి సంపులో చిన్నారి పడిపోయి ఉండటాన్ని గమనించారు. వెంటనే స్పందించి బయటకు తీసినప్పటికీ, అప్పటికే ఆ పాప మృతి చెందింది.
అప్పటిదాకా ఆడుకుంటూ ఉన్న చిన్నారి.. అంతలోనే విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ హృదయవిదారక ఘటనతో జన్వాడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నివాస ప్రాంతాల్లోని నీటి సంపులు, బావులు, వాటర్ ట్యాంకులకు మూతలు లేదా కవర్లు ఏర్పాటు చేసుకోవాలని, చిన్నారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అమ్మకు చెప్పలేని పని ఎప్పుడూ.. ఎవ్వరూ చేయొద్దు: లోకేశ్
లండన్‌లో కౌన్సిలర్‌గా భూపాలపల్లి జిల్లా యువతి
For More TG News And Telugu News