రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో పీసీసీ చీఫ్ భేటీ.. ఓటర్ల జాబితా సవరణపై చర్చ
ABN , Publish Date - May 15 , 2026 | 12:48 PM
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, మే 15: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై చర్చించేందుకు పలువురు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ఎన్నికల అధికారి కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలో అక్రమాలు జరగకుండా చూడాలని అధికారులను కోరారు. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా లేని ఓట్లను జాబితా నుంచి తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా ఆరోపించారు. ప్రతిపక్షాలకు పడే ఓట్లను టార్గెట్ చేస్తూ తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిపై ఎన్నికల కమిషన్ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. ‘ఓటర్లందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరి ఓట్లను వారే కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలు తమ ఓటు హక్కు జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి’ అని అన్నారు. ఈ భేటీలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు ఓటర్ల జాబితాలో పారదర్శకత పాటించాలని ఎన్నికల అధికారికి వినతిపత్రం సమర్పించారు.
ఇవి కూడా చదవండి..
ప్రత్యర్థి పార్టీ కుట్రలకు ఇక కాలం చెల్లింది: సీఎం చంద్రబాబు
మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు.. నేను అడగలేదు: కోదండరాం
Read Latest Telangana News And Telugu News