Share News

‘ఉడాన్’తో ఉద్యోగాల దిశగా అడుగులు: మంత్రి శ్రీధర్ బాబు

ABN , Publish Date - Sep 19 , 2026 | 06:40 PM

తెలంగాణ యువతకు భవిష్యత్‌ సాంకేతిక నైపుణ్యాలు అందించడంతో పాటు ఉపాధి అవకాశాలను పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.

‘ఉడాన్’తో ఉద్యోగాల దిశగా అడుగులు: మంత్రి శ్రీధర్ బాబు
Telangana Udaan Programme

హైదరాబాద్, సెప్టెంబర్ 19: తెలంగాణ యువతకు భవిష్యత్‌ సాంకేతిక నైపుణ్యాలు అందించడంతో పాటు ఉపాధి అవకాశాలను పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌, డెల్‌ టెక్నాలజీస్‌ మధ్య ‘ఉడాన్’ కార్యక్రమం అమలుకు కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 25 శిక్షణ కేంద్రాల్లో 5,500 మంది విద్యార్థులకు మూడు నెలల పాటు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ తయారీతో పాటు ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌, డిజిటల్‌ స్కిల్స్‌పై విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. IIT ఢిల్లీ రూపొందించిన కరిక్యులమ్‌ ఆధారంగా శిక్షణ కొనసాగనుండగా, డెల్‌ టెక్నాలజీస్‌ అవసరమైన టెక్నాలజీ సపోర్ట్‌ అందించనుంది.


‘ఉడాన్’ కార్యక్రమం కేవలం శిక్షణకు పరిమితం కాకుండా విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేయడమే లక్ష్యంగా రూపొందించారు. విద్యార్థులకు ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్‌, ఉద్యోగ నైపుణ్యాలతో పాటు అప్రెంటిస్‌షిప్‌.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అవకాశాలపై కూడా అవగాహన కల్పించనున్నారు. గ్రామీణ ప్రాంతాల యువతకు సైతం ఫ్యూచర్‌ టెక్నాలజీ స్కిల్స్‌ అందేలా కార్యక్రమాన్ని విస్తరించనున్నారు. ఎడ్యుకేషన్‌ నుంచి స్కిల్లింగ్‌, స్కిల్లింగ్‌ నుంచి ఎంప్లాయ్‌మెంట్‌ దిశగా యువతను తీసుకెళ్లే ట్రైనింగ్‌–టు–ఎంప్లాయ్‌మెంట్‌ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడమే TASK–Dell భాగస్వామ్యం ప్రధాన ఉద్దేశంగా ఉంది. శిక్షణ పొందిన వారి సంఖ్యకే ప్రాధాన్యం ఇవ్వకుండా, వారికి వాస్తవంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ‘ఉడాన్’ను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌లో అంతర్జాతీయ చోరీ మొబైల్ ఫోన్ల డిస్పోజల్ రాకెట్ గుట్టురట్టు

మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క ఆదేశాలివే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 19 , 2026 | 07:48 PM