Share News

పట్టణ ప్రగతికి కేంద్రం నిధులు

ABN , Publish Date - Oct 23 , 2026 | 05:34 AM

పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ (యూసీఎఫ్‌), క్రెడిట్‌ రీపేమెంట్‌ గ్యారెంటీ సబ్‌ స్కీమ్‌ (సీఆర్‌జీఎస్‌ఎస్‌ జెక్టుల రూపకల్పన, ప్రతిపాదనల తయారీ, పాలనా అనుమతుల ప్రక్రియ వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది

పట్టణ ప్రగతికి కేంద్రం నిధులు
cm revanthreddy

  • అనుమతులపై పురపాలక శాఖ ఉత్తర్వులు

  • అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ ప్రాజెక్టుల్లో ఇక వేగం ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్ మరో ఐదేళ్లు

  • టీడీఆర్‌కు ఆధార్‌ ధ్రువీకరణ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు

హైదరాబాద్‌, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ (యూసీఎఫ్‌), క్రెడిట్‌ రీపేమెంట్‌ గ్యారెంటీ సబ్‌ స్కీమ్‌ (సీఆర్‌జీఎస్‌ఎస్‌ జెక్టుల రూపకల్పన, ప్రతిపాదనల తయారీ, పాలనా అనుమతుల ప్రక్రియ వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందుకోసం పురపాలక శాఖ జీవో 952ను జారీ చేసింది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఇచ్చిన మార్గదర్శకాలను మున్సిపాలిటీల్లో అమలు చేయాలని ఆదేశించింది. అయితే, ప్రభుత్వం సూత్రప్రాయంగా అనుమతులు ఇచ్చే ప్రక్రియకు రెండు షరతులు విధించింది. యూసీఎఫ్‌, సీఆర్‌జీఎఎస్ ప్రతిపాదించే ప్రాజెక్టులకు సూత్రప్రాయ పరిపాలనా అనుమతులు ఇచ్చే బాధ్యతను రాష్ట్ర మిషన్‌ డైరెక్టర్‌కు అప్పగించింది. రాష్ట్రస్థాయి హైపవర్‌ కమిటీ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపి, దాన్ని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఆమోదం కోసం పంపి ఉండాలి. అలాగే సంబంధిత ప్రాజెక్టు ప్రాథమిక నివేదిక (పీపీఆర్‌)కు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం పొంది ఉండాలి. ఈ రెండు షరతులకు లోబడి ఉన్నప్పుడే రాష్ట్ర మిషన్‌ డైరెక్టర్‌ సూత్రప్రాయ పరిపాలనా అనుమతులు మంజూరు చేయవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ ప్రాజెక్టుల పరిశీలన, ఆమోదం కోసం ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రస్థాయి సాంకేతిక, హైపవర్‌ కమిటీలను ఏర్పాటు చేసింది. మున్సిపల్‌ శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ మిషన్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో తెలిపారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రాజెక్టులు ప్రతిపాదించి నిధులు రాబట్టుకోవాలని పురపాలక శాఖ అధికారులు, కమిషనర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.


రూ.లక్ష కోట్లతో పథకం..

కేంద్ర ప్రభుత్వం అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ కోసం రూ.లక్ష కోట్ల సహాయాన్ని ప్రకటించింది. పట్టణ ప్రాజెక్టులకు రూ.90 వేల కోట్లు, ప్రాజెక్టుల తయారీ, సామర్ధ్య పెంపునకు రూ.5 వేల కోట్లు, క్రెడిట్‌ రీపేమెంట్‌ గ్యారెంటీ సబ్‌ స్కీమ్‌కు రూ.5 వేల కోట్లు కేటాయించింది. సాధారణ గ్రాంట్లకు భిన్నంగా ఈ పథకం ద్వారా మార్కెట్‌ ఆధారిత నిధుల సమీకరణకు అవకాశం ఉంటుంది. ఎంపిక చేసిన ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర సహాయం గరిష్ఠంగా 25 శాతం, మున్సిపల్‌ బాండ్లు, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం కింద 50 శాతం నిధులు సమీకరిస్తారు. మిగిలిన 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన ఇతర వనరుల ద్వారా సమీకరించాల్సి ఉంటుంది. తెలంగాణలో సమగ్ర టౌన్‌షి్‌పల అభివృద్ధికి సంబంధించిన ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షి్‌ప పాలసీని మరో ఐదేళ్లు కొనసాగించేందుకు అనుమతిస్తూ పురపాలక శాఖ గురువారం జీవో 950 జారీచేసింది. 2020 నవంబరు 3న ఇచ్చిన జీవో 189 ద్వారా జారీ చేసిన విధానాన్ని మరో ఐదేళ్లపాటు కొనసాగించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ చట్టం -2008, కోర్‌ అర్బన్‌ రీజియన్‌ చట్టం -2026, తెలంగాణ మున్సిపాలిటీస్‌ చట్టం -2019 పరిధికి లోబడి ఈ ఉత్తర్వులు కొనసాగనున్నట్లు వెల్లడించింది.

టీడీఆర్‌ దరఖాస్తులకు ఆధార్‌ ధ్రువీకరణ తప్పనిసరి

ట్రాన్స్‌ఫర్‌బుల్‌ డెవల్‌పమెంట్‌ రైట్స్‌ (టీడీఆర్‌) పోర్టల్‌లో ఆస్తి యజమానులు, బిల్డర్లు, డెవలపర్లకు ఆధార్‌ ధ్రువీకరణ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆధార్‌ ధ్రువీకరణ వల్ల నకిలీల బెడదకు అడ్డుకట్ట పడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒకవేళ ఆధార్‌ లేకపోతే ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాల కింద పాస్‌పోర్టు, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌), పురపాలక శాఖ అంగీకరించే ఫొటో ఉన్న ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాల ద్వారా ధ్రువీకరణ పొందాల్సి ఉంటుందని తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి

ఓటు హక్కు తొలగింపు చిన్న విషయమా?

భారత టెలికాంపై బడా గుత్తాధిపత్యం!

Updated Date - Oct 23 , 2026 | 05:41 AM