Share News

Telagnana: రేప్‌ కేసులో నన్ను ఏకపక్షంగా ఉద్యోగం నుంచి తొలగించారు

ABN , Publish Date - Jan 13 , 2026 | 07:23 AM

ఓ రేప్‌ కేసులో నిందితుడిగా ఉన్నందుకు తనను ఏకపక్షంగా ఉద్యోగం నుంచి తొలగించారని పేర్కొంటూ ఓ మాజీ ఎస్‌ఐ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. వివరణ ఇవ్వాలని ప్రతివాదులైన డీజీపీ, ఐజీ (జోన్‌-1), జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీచేసింది. తనను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని..

Telagnana: రేప్‌ కేసులో నన్ను ఏకపక్షంగా ఉద్యోగం నుంచి తొలగించారు

  • హైకోర్టులో ఎస్‌ఐ రిట్‌ పిటిషన్‌

  • పోలీసుశాఖకు నోటీసులు జారీచేసిన డివిజన్‌ బెంచ్‌

హైదరాబాద్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఓ రేప్‌ కేసులో నిందితుడిగా ఉన్నందుకు తనను ఏకపక్షంగా ఉద్యోగం నుంచి తొలగించారని పేర్కొంటూ ఓ మాజీ ఎస్‌ఐ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. వివరణ ఇవ్వాలని ప్రతివాదులైన డీజీపీ, ఐజీ (జోన్‌-1), జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీచేసింది. తనను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని సవాల్‌ చేస్తూ కాళేశ్వరం పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేసిన పడాల వెంకట సదానంద భవానీసేన్‌ తొలుత హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జడ్జి.. పోలీసులంటే సమాజానికి ఆదర్శంగా ఉండాలని, ఇలాంటి ఆరోపణలతో పోలీసుశాఖలో క్రమశిక్షణ లేదనే భావన ప్రజల్లోకి వెళ్తుందంటూ పిటిషన్‌ను కొట్టివేశారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ పిటిషనర్‌ డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎ.రవీందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చార్జి మెమో ఇవ్వకుండా, విచారణకు ఆదేశించకుండా ఏకపక్షంగా ఉద్యోగం నుంచి తీసేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. పోలీసుశాఖ తరఫు న్యాయవాది వాదిస్తూ.. పిటిషనర్‌ అలవాటుగా మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. వాదనలు విన్న డివిజన్‌ బెంచ్‌.. పోలీసుశాఖకు నోటీసులు జారీచేస్తూ విచారణను 8 వారాలకు వాయుదా వేసింది.


Also Read:

Special Buses: టీఎస్‌ఆర్‌టీసీకి పండగ

Telangana: ఎన్‌టీవీపై ఐఏఎస్‌ల సంఘం ఫిర్యాదు

Atreyapuram: హైలెస్సొ..హైలెస్సా...

Updated Date - Jan 13 , 2026 | 07:23 AM