Share News

రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు: మంత్రి ఉత్తమ్ కుమార్

ABN , Publish Date - Apr 29 , 2026 | 06:27 PM

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా యాసంగి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ అత్యంత వేగంగా, పారదర్శకంగా సాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..

రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు: మంత్రి ఉత్తమ్ కుమార్
Telangana Paddy Procurement

హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా యాసంగి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ అత్యంత వేగంగా, పారదర్శకంగా సాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తూ, ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు. ఈ యాసంగి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు.


ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం ఈ సీజన్‌లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 8,525 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటికే 6,500కు పైగా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఐకేపీ (IKP) ఆధ్వర్యంలో 2,623, వివిధ సొసైటీల ద్వారా 3,278 కేంద్రాలు నడుస్తున్నాయి. సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు 6,500 లారీలను సిద్ధం చేశారు. ఇప్పటికే 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు చేరింది. ధాన్యం నిల్వ కోసం ముందస్తుగా 20 కోట్ల గన్నీ సంచులను సిద్ధంగా ఉంచారు. ఇప్పటివరకు రూ. 2,031 కోట్ల విలువైన 8.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. రైతులకు ఇప్పటికే రూ. 323 కోట్ల నగదును వారి ఖాతాల్లో జమ చేశారు. 3.46 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేయడం ద్వారా 64,779 మంది రైతులకు లబ్ధి చేకూరింది. అలాగే, 30,220 మెట్రిక్ టన్నుల సెనగ కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యింది’ అని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అనంతపురం మీదుగా తిరుపతికి రైలు

రైలులో మహిళపై దారుణం.. ఏసీ కోచ్‌లోకి తీసుకెళ్లి..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 29 , 2026 | 07:02 PM