Share News

పోలీసులు, న్యాయవ్యవస్థ సమన్వయంతోనే సత్వర న్యాయం: హైకోర్టు సీజే

ABN , Publish Date - Aug 20 , 2026 | 08:21 PM

హైదరాబాద్‌లో కొత్త క్రిమినల్‌ చట్టాల డిజిటలైజ్డ్‌ అమలుపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. కొత్త చట్టాల సమర్థవంతమైన అమలుకు న్యాయవ్యవస్థ, పోలీస్‌, ప్రాసిక్యూషన్‌, ఫోరెన్సిక్‌, వైద్య, జైళ్ల శాఖల మధ్య సమన్వయం కీలకమని అధికారులు స్పష్టం చేశారు.

పోలీసులు, న్యాయవ్యవస్థ సమన్వయంతోనే సత్వర న్యాయం: హైకోర్టు సీజే
Chief Justice Aparesh Kumar Singh

హైదరాబాద్‌, ఆగస్టు 20: నగరంలో BNS, BNSS, BSA కొత్త క్రిమినల్‌ చట్టాల డిజిటలైజ్డ్‌ అమలుపై తెలంగాణ స్టేట్‌ జ్యుడీషియల్‌ అకాడమీ, తెలంగాణ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక సమగ్ర సమన్వయ సదస్సు నిర్వహించారు. కొత్త చట్టాల అమలుకు పోలీసులు, న్యాయవ్యవస్థ, ప్రాసిక్యూషన్‌, ఫోరెన్సిక్‌, వైద్య, జైళ్ల శాఖల మధ్య బలమైన సమన్వయం అవసరమని తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ పేర్కొన్నారు. సంస్థలు సమన్వయంతో పనిచేసినప్పుడే బాధితులకు సత్వర న్యాయం అందుతుందని తెలిపారు. జస్టిస్‌ మౌషుమీ భట్టాచార్య కొత్త చట్టాల అమలులో డిజిటల్‌ లిటరసీ అత్యంత అవసరమని, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో తప్పులు, డూప్లికేట్‌ డేటా ఎంట్రీ వల్ల కేసుల్లో జాప్యం జరుగుతోందని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,200 మంది న్యాయ, పోలీస్‌, ప్రాసిక్యూషన్‌, జైళ్లు, ఫోరెన్సిక్‌, వైద్య శాఖల అధికారులు హైబ్రిడ్‌ విధానంలో సదస్సుకు హాజరయ్యారు.

డీజీపీ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ.. ‘కొత్త క్రిమినల్‌ చట్టాలు కేవలం పాత చట్టాల స్థానంలో వచ్చినవి మాత్రమే కాదు. సైంటిఫిక్‌ ఇన్వెస్టిగేషన్‌, డిజిటల్‌ ఎవిడెన్స్‌, ఎలక్ట్రానిక్‌ రికార్డులు, టైమ్‌ బౌండ్‌ ప్రొసీజర్స్‌కు ప్రాధాన్యం ఇస్తాయి’ అని అన్నారు.


Sakshya, e-FIR, డిజిటల్‌ ఎవిడెన్స్‌, డిజిటల్‌ కేస్‌ మేనేజ్‌మెంట్‌, ICJS, e-Summons, FIR నుంచి చార్జ్‌షీట్‌ వరకు ఆన్‌లైన్‌ ప్రక్రియలపై సదస్సులో ప్రజెంటేషన్లు ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు సాక్ష్యాలు, ఫోరెన్సిక్‌–మెడికల్‌ ఇంటర్‌ఫేస్‌లపై అవగాహన కల్పించారు. పోలీస్‌, ప్రాసిక్యూషన్‌, జైళ్ల శాఖల మధ్య సమాచార మార్పిడి మరింత వేగవంతం కావాలని డీజీపీ సూచించారు. కొత్త చట్టాల అమలుపై నెలవారీ సమీక్షా వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పాటు హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.


ఇవి కూడా చదవండి...

ఎస్‌సీబీఏ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడిగా రవిశంకర్ ఎన్నిక

సీఎం చంద్రబాబు ఆదర్శ పాలన అందిస్తున్నారు: ఎంపీ శ్రీభరత్

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 20 , 2026 | 09:36 PM