Share News

హెలెన్ కెల్లర్ స్ఫూర్తితో దివ్యాంగులు ముందుకు సాగాలి: మంత్రి సీతక్క

ABN , Publish Date - Jun 27 , 2026 | 04:03 PM

దివ్యాంగుల కోసం రాష్ట్రంలోని 14 నైబర్‌హుడ్ సెంటర్లకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించే లక్ష్యంతో ఈ-ఆటోల పంపిణీని కాంగ్రెస్ సర్కార్ ప్రారంభించింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఈ-ఆటోలు దివ్యాంగులకు, వారి కుటుంబాలకు ఆత్మవిశ్వాసం, గౌరవం, అవకాశాలను అందించే ఆశా వాహనాలు అని ఆమె అన్నారు.

హెలెన్ కెల్లర్ స్ఫూర్తితో దివ్యాంగులు ముందుకు సాగాలి: మంత్రి సీతక్క
Persons with Disabilities

హైదరాబాద్, జూన్ 27: దివ్యాంగుల కోసం రాష్ట్రంలోని 14 నైబర్‌హుడ్ సెంటర్లకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించే లక్ష్యంతో ఈ-ఆటోల పంపిణీని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. హెలెన్ కెల్లర్ జయంతి సందర్భంగా దివ్యాంగుల రవాణా సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ-ఆటోలను పంపిణీ చేయడం శుభపరిణామమని మంత్రి సీతక్క అన్నారు. దివ్యాంగులు జీవితాన్ని సవాల్‌గా స్వీకరిస్తే అసాధారణ విజయాలను సాధించగలరని ఆమె పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి, వారి అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.

seetakk4.jpg


ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ‘వైకల్యం అనేది కేవలం శారీరక లోపమే. మానవత్వంలేని వారే అసలైన దివ్యాంగులు. ఇతరులను అవమానించే అహంకారం కూడా ఒక రకమైన వైకల్యమే. పుట్టుకతో వచ్చిన లోపాలను తల్లిదండ్రుల ప్రోత్సాహం, సరైన శిక్షణ, సమాజం సహకారంతో అధిగమించవచ్చు. చూపు, వినికిడి లేకపోయినా హెలెన్ కెల్లర్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచారు' అని అన్నారు.

seekakka.jpg'దివ్యాంగులను చీదరించకుండా వారికి అవకాశాలు కల్పిస్తే అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. బ్రెయిలీ వంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అనేక మంది దివ్యాంగులు తమ లక్ష్యాలను చేరుకుంటున్నారు. తల్లిదండ్రులపై ఉన్న ఆర్థిక, రవాణా భారాన్ని తగ్గించడానికే ఈ-ఆటోల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం’ అని సీతక్క చెప్పారు. ఈ సందర్భంగా ఐఓసీఎల్‌కు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఫిలిప్పీన్స్‌లో భూకంపం

భూకంపం వస్తోంది జాగ్రత్త

Updated Date - Jun 27 , 2026 | 04:52 PM