22ఏ భూముల సమస్యకు చెక్.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
ABN , Publish Date - Aug 20 , 2026 | 07:25 PM
రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూముల అంశంలో ప్రజలకు పూర్తి భరోసా కల్పించే దిశగా రెవెన్యూ శాఖ చర్యలను మరింత వేగవంతం చేసిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 20: రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూముల అంశంలో ప్రజలకు పూర్తి భరోసా కల్పించే దిశగా రెవెన్యూ శాఖ చర్యలను మరింత వేగవంతం చేసిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. 22ఏ భూములపై వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా తీసుకుని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాల్ సెంటర్‌కు ఇప్పటి వరకు సుమారు 400 కాల్స్ వచ్చిన నేపథ్యంలో, ఫిర్యాదు పరిష్కారమయ్యే వరకు అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. తహసీల్దార్లు, ఆర్డీవోలు, సబ్‌రిజిస్ట్రార్లు ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, సంబంధిత భూమి 22ఏ జాబితాలోకి ఎందుకు వచ్చిందో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని స్పష్టం చేశారు. అర్హులైన నిజమైన హక్కుదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని మంత్రి పొంగులేటి అన్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, 22ఏ భూముల సమస్యను ప్రత్యేక టాస్క్‌గా తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ, స్టాంప్స్-రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, సొంత నిర్ణయాలతో ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని స్పష్టం చేశారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన వారికి న్యాయం చేయడంతో పాటు ప్రజలకు పూర్తి భరోసా కల్పించేలా అధికారులు పనిచేయాలని మంత్రి ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
అసెంబ్లీకి రాకుండా పారిపోతున్న జగన్: మంత్రి లోకేశ్
కుమార్తె వ్యాఖ్యలు.. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన మంత్రి కొండా సురేఖ
Read Latest TG News And Telugu News