Share News

తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. నియామకాల్లో జోక్యానికి నిరాకరణ

ABN , Publish Date - Apr 02 , 2026 | 10:00 PM

తెలంగాణ రాష్ట్రంలో 2024 గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా చేపట్టిన నియామక ప్రక్రియపై జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. నియామకాల్లో జోక్యానికి నిరాకరణ
Telangana Group 1 case

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: తెలంగాణ రాష్ట్రంలో 2024 గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా చేపట్టిన నియామక ప్రక్రియపై జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. మొత్తం 563 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన గ్రూప్-1 ఎంపిక ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగినట్లు పలువురు అభ్యర్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా జవాబు పత్రాల మూల్యాంకనం (Evaluation)లో తీవ్రమైన తప్పులు దొర్లాయని, తమ వాదనలను హైకోర్టు సింగిల్ బెంచ్ సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుత నోటిఫికేషన్‌ను రద్దు చేసి, మళ్లీ కొత్తగా పరీక్షలు నిర్వహించాలని వారు కోర్టును అభ్యర్థించారు.


ఈ పిటీషన్‌పై జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. టీజీపీఎస్సీ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని కోర్టుకు వివరించారు. ఉభయ పక్షాల వాదనలు విన్న అనంతరం, జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు సహేతుకంగానే ఉందని భావించిన ధర్మాసనం, అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లేవని పేర్కొంటూ, అభ్యర్థుల దాఖలు చేసిన పిటిషన్లను డిస్మిస్ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

దేశంలో డిజిటల్‌ జనగణన ప్రారంభం

యుద్ధం ప్రభావం ప్రజల మీద పడొద్దు!

Read Latest Telangana News and National News

Updated Date - Apr 02 , 2026 | 10:01 PM