స్టార్ హాస్పిటల్స్ వైద్య బృందానికి ఆబ్‌స్ట్రాక్ట్ కాంపిటీషన్ అవార్డు
ABN , Publish Date - Nov 27 , 2026 | 02:04 AM
హైదరాబాద్‌కు చెందిన స్టార్ హాస్పిటల్స్ వైద్య బృందం అరుదైన ఘనత సాధించింది
‘ఆఫ్-పంప్ బైపాస్ సర్జరీ’తో సత్ఫలితాలు
కిడ్నీ రోగులకు తగ్గిన డయాలసిస్ అవసరం
హైదరాబాద్ సిటీ, నవంబర్ 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కు చెందిన స్టార్ హాస్పిటల్స్ వైద్య బృందం అరుదైన ఘనత సాధించింది. బలహీన కిడ్నీలు గల రోగులకు గుండె కొట్టుకుంటుండగానే చేసే ‘ఆఫ్-పంప్ బైపాస్ సర్జరీ’ వల్ల డయాలసిస్ అవసరం గణనీయంగా తగ్గిందని రుజువు చేసిన పరిశోధనకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ఈ నెల 20-22 తేదీల మధ్య జరిగిన 12వ అంతర్జాతీయ కరోనరీ కాంగ్రెస్ (ఐసీసీ)లో స్టార్ హాస్పిటల్స్ కార్డియో థొరాసిస్ సర్జరీ బృందం.. ‘అబ్‌స్ట్రాక్ట్ కాంపిటీషన్ విన్నర్’ పురస్కారాన్ని అందుకున్నది.సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్, కార్డియో వాస్కులర్ సర్జికల్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ లోకేశ్వరరావు సజ్జ నేతృత్వంలో, డాక్టర్ గోపీచంద్ మన్నం సహకారంతో సాగిన ఈ పరిశోధన వివరాలను సదస్సులో డాక్టర్ ఆదిత్య కొప్పుల సమర్పించారు. 25 ఏళ్లుగా తమ ఆస్పత్రిలో చికిత్స పొందిన వేలాది మంది రోగుల వివరాల విశ్లేషణతో ఈ పరిశోధన సాధ్యమైందని డాక్టర్ లోకేశ్వరరావు సజ్జ వెల్లడించారు. కిడ్నీలు బలహీనంగా ఉన్న రోగుల్లో బీటింగ్ హార్ట్ బైపాస్ సర్జరీ డయాలసిస్ ముప్పును తగ్గించడంలో తోడ్పడుతుందని తెలిపారు. ఈ గుర్తింపు తమ బృందం సమష్టి కృషికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ఈ వైద్య బృందాన్ని స్టార్ హాస్పిటట్స్ యాజమాన్యం అభినందించింది.
ఇవి కూడా చదవండి..
ఈ నెల 30 నుంచి లోక్‌సభ సమావేశాలు.. తెరపైకి పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులు?
రాహుల్ గాంధీ ఫొటో పెడితే బ్లాక్ చేస్తున్నారు.. మెటాపై కోర్టుకెక్కిన కాంగ్రెస్