సింగీతం శ్రీనివాసరావు మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Oct 04 , 2026 | 09:34 AM
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ సినీ రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
హైదరాబాద్, అక్టోబర్ 4: ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన సీఎం.. భారతీయ సినీ రంగానికి సింగీతం శ్రీనివాసరావు అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. తనదైన శైలిలో ఎన్నో విలక్షణ చిత్రాలను తెరకెక్కించి సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన సింగీతం శ్రీనివాసరావు సేవలను సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. ఆయన మరణం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు.
సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ఈ విషాద సమయంలో ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. సింగీతం శ్రీనివాసరావు సినీ రంగానికి చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని సీఎం పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
పోలవరం పనులు పరిశీలించిన పీపీఏ సీఈవో