సిద్దిపేట జిల్లాలో దారుణం.. పంట పొలాల్లో మహిళ దారుణ హత్య..
ABN , Publish Date - Aug 09 , 2026 | 10:32 AM
సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దుబ్బాక మండలం రామక్కపేటలో పంట పొలాల్లో ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు హత్య చేసి, మృతదేహాన్ని కాల్చివేయడం కలకలం రేపింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
సిద్దిపేట, ఆగస్టు 9: జిల్లాలోని దుబ్బాక మండలం రామక్కపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పంట పొలాల్లో గుర్తుతెలియని దుండగులు ఓ మహిళను హత్య చేసి, అనంతరం మృతదేహాన్ని కాల్చివేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న దుబ్బాక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మహిళను గుర్తించేందుకు, ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు.
మహిళను వేరే ప్రాంతంలో హత్య చేసి, మృతదేహాన్ని రామక్కపేట పంట పొలాల్లోకి తీసుకొచ్చి కాల్చివేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన వెనుక ఉన్న కారణాలు.. హత్యకు పాల్పడిన వ్యక్తుల వివరాలను తెలుసుకునేందుకు దుబ్బాక పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులను త్వరగా పట్టుకునేందుకు పోలీస్ కమిషనర్ ఆదేశాలతో ప్రత్యేకంగా రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, ఇతర సమాచారాన్ని పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
యూపీఐ చెల్లింపులు ఉచితమే: ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్
డీప్‌ఫేక్ వీడియోలపై కేంద్రం కన్నెర్ర.. చర్యలు తీసుకోవాలని మెటాకు అదేశం.