Share News

Hyderabad: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి..

ABN , Publish Date - Jan 08 , 2026 | 09:53 AM

సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేవారు తగుజాగ్రత్తలు తీసుకోవాలని పొలీస్ శాఖ సూచిస్తోంది. దొంగతనాలు జరిగే అవకాశం ఉందని తెలుపుతున్నారు. అలాగే ఊర్లకు వెళ్లేవారు విలువైన వస్తువులను ఇళ్లల్లో ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Hyderabad: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి..

- ఖైరతాబాద్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు

హైదరాబాద్: సంక్రాంతి సమయంలో ఊరికి వెళ్లే వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగలు చేతివాటం ప్రదర్శిస్తుంటారు. ఊరికి వెళ్లి వచ్చిన అనంతరం దొంగలు పడ్డారని లబోదిబోమనడం కంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. ఖైరతాబాద్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు పలు సూచనలు చేశారు.

- ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించమని చెప్పాలి

- ఇంట్లోగాని, హాస్టల్‌లోగాని బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంక్‌ లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం. లేదా ఎక్కువ రోజులు ఊళ్లకు వెళ్లే వారు విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలి.


- విలువైన వస్తువులను స్కూటర్‌ డిక్కీల్లో, కార్లలో పెట్టవద్దు.

- ద్విచక్ర వాహనాలు, కార్లను ఇంటి ఆవరణలోనే పార్కింగ్‌ చేయాలి. రోడ్లపై నిలపరాదు.

- బీరువా, లాకర్‌ తాళాలను ఇంట్లో ఉంచరాదు. వెంట తీసుకెళ్లాలి.

- ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్‌ కర్టెన్‌ వేయాలి.

- గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి.


city4.2.jpg

- ఎక్కువ రోజులు విహారయాత్రల్లో ఉంటే పేపరు, పాలు పోసే వారిని ఇంటికి రావద్దని చెప్పాలి.

- పని మనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలి.

- విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు.

- టైమర్‌తో కూడిన లైట్లను ఇంట్లో అమర్చుకోవాలి.

- బ్యాగుల్లో బంగారు నగలు డబ్బు పెట్టుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు దగ్గరలో పెట్టుకోవాలి. బ్యాగు బస్సులో పెట్టి కిందికి దిగితే దొంగలు అపహరిస్తారు.

- ఇంటి డోర్‌కు సెంట్రల్‌ లాకింగ్‌ సిస్టంను ఏర్పాటు చేసుకోవడం సురక్షితం.


- హోమ్‌ సెక్యూరిటీ సిస్టం ద్వారా ఇంటర్నెట్‌ అనుసంధానం ఉన్న మీ మొబైల్‌ నుంచే మీ ఇంటిని ఎక్కడి నుంచి అయినా ప్రత్యక్షంగా చూసుకునే వీలుంది. ఇంటికి సంబంధించిన నాణ్యమైన సీసీ టీవీలు ఆన్‌లైన్‌ లేదా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. హోమ్‌ సెక్యూరిటీ సర్వెలెన్స్‌కు ఇవి ఎంతో ఉపయుక్తం.

- ఇంటి భద్రతాపరంగా ఇంటికి దృఢమైన, నాణ్యమైన తలుపులతో పాటు హై ఎండ్‌ గోద్రెజ్‌ హై సెక్యూరిటీ లాక్‌ సిస్టంని వాడడం మంచిది.

- తాళం వేయడం కంటే గోద్రెజ్‌ డోర్‌ లాక్‌ చేయడం వల్ల ఇంట్లో మనుషులు ఉన్నారా? లేరా? అనేది తెలియదు.


- ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లేటప్పుడు చుట్టు పక్కల వారికి లేదా స్థానిక పోలీ్‌సస్టేషన్‌కు సమాచారం అందించాలి.

- నమ్మకమైన సెక్యూరిటీ గార్డులను, వాచ్‌మన్‌ను నియమించుకోవాలి. కాలనీవాళ్లు కమిటీలు వేసుకొని వాచ్‌మన్లను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.

- దూర ప్రాంతాలకు వెళ్లే వారు తమ ఇంటి చిరునామా, ఫోన్‌ నెంబర్‌ను పోలీసుస్టేషన్‌కు తెలపాలి. దీంతో వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసుకుని ఊర్లెళ్లిన వారి ఇళ్లపై నిఘాను ఏర్పాటు చేస్తాం.

- కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్‌ లేదా హైదరాబాద్‌ పోలీస్‌ వాట్సాప్‌ నెంబర్‌ 9490616555కు సమాచారం ఇవ్వాలి.


ఈ వార్తలు కూడా చదవండి..

జనార్దనరావుతో చాలా ఏళ్లుగా స్నేహం

ప్రత్యేక సర్వీసుల్లో అదనపు చార్జీలు ఉండవు: ఆర్టీసీ

Read Latest Telangana News and National News

Updated Date - Jan 08 , 2026 | 09:53 AM