Share News

Sankranthi celebrations: ఇంటింటా సంక్రాంతి.. ఎటుచూసినా సందడే సందడి

ABN , Publish Date - Jan 15 , 2026 | 08:20 AM

హైదరాబాద్ మహానగరంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న భోగి, నేడు సంక్రాంతి పండుగను పురష్కరించుకుని ఎక్కడ చూసినా సందడే సందడి కనబడుతోంది. కాలనీలు, బస్తీలు, శివారు ఏరియాల్లో పండుగ వేడుకలు అంబరానంటుతున్నాయి.

Sankranthi celebrations: ఇంటింటా సంక్రాంతి.. ఎటుచూసినా సందడే సందడి

- ఆనందోత్సాహాలతో భోగి వేడుకలు..

- కాలనీలు, అపార్ట్‌మెంట్‌లలో సందడి

హైదరాబాద్‌ సిటీ: నగరంలో సంక్రాంతి వేడుకలు(Sankranthi celebrations) సంబురంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పండుగలో బుధవారం ఉదయం కాలనీలు, అపార్ట్‌మెంట్‌లలో భోగి మంటలు వేశారు. ఇంట్లోని పాత చెక్క వస్తువులను భోగి మంటల్లో కాల్చి, నూతన ఆరంభాలకు శ్రీకారం చుట్టారు. సంక్రాంతి సంబురం నగరంలో ఏముంటుంది? గ్రామాల్లోనే ఆ సందడంతా అంటూ చాలామంది పండుగ కోసం గ్రామాలకు వెళ్లిపోయారు కానీ, నగరంలో ఉన్న వారు ఆ పండుగ స్ఫూర్తిని కొనసాగించడానికి తాపత్రయపడటం కనిపించింది.


city4.2.jpg

యువత సైతం ఇందులో భాగస్వామవడం మంచి పరిణామం. ఇక సామాజిక మాధ్యమాలు, ప్రసార సాధనాల ద్వారా సంక్రాంతి పండుగ విశిష్టతను గొప్పగా చెబుతూ సందేశాలు, ఫొటోలు పంపడం కనిపించింది. భోగి మంటలు వేయడం, పతంగులు ఎగురవేయడం వంటి వాటితో యువత బిజీగా గడిపారు. టీవీలు, ఫోన్లకు అతుక్కుపోయే తమ పిల్లలు పండుగ పేరిట ఇలా బయట తిరగడం చాలా ఆనందంగా ఉందని కొంతమంది తల్లిదండ్రులు చెప్పారు.


city4.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి.

మరింత పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

20 నుంచి వన్యప్రాణుల లెక్కింపు షురూ..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 15 , 2026 | 08:20 AM