Share News

బహదూర్‌గూడలో ఉద్రిక్తత.. బుల్లెట్ ట్రైన్ భూసేకరణపై రైతుల నిరసన

ABN , Publish Date - Jul 18 , 2026 | 11:03 AM

రంగారెడ్డి జిల్లా బహదూర్‌గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం చేపట్టనున్న భూసేకరణ ఉద్రిక్తతకు దారితీసింది. అధికారులు స్పష్టమైన హామీలు ప్రకటించిన తర్వాతే భూములు అప్పగిస్తామని రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు.

బహదూర్‌గూడలో ఉద్రిక్తత.. బుల్లెట్ ట్రైన్ భూసేకరణపై రైతుల నిరసన
Bahadurguda Land Acquisition

రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో హైటెన్షన్‌ నెలకొంది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం బహదూర్‌గూడ భూముల దగ్గరకు హైడ్రా బృందాలు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ భూములను ఇవ్వడానికి రైతులు నిరాకరిస్తున్నారు.

అధికారులు స్పష్టమైన హామీలు ప్రకటించిన తర్వాతే భూములను అప్పగిస్తామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ రైతులు గత ఆరు రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. భూముల వద్ద భారీగా అధికారులు, పోలీసు బలగాలు మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


Also Read:

ములుగులో యువకుడి దారుణ హత్య .. వేట కొడవళ్లతో నరికి చంపిన దుండగులు

రూ.2 వేలకుపైగా యూపీఐ పేమెంట్స్‌కు ఛార్జీలు?.. వారికి మినహాయింపు!

Updated Date - Jul 18 , 2026 | 11:43 AM